Amalapuram: కోనసీమలో గణేష్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్!
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గణేష్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు: ఎస్ఈ బి. రాజేశ్వరి వెల్లడి.
Amalapuram: కోనసీమలో గణేష్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్!
Amalapuram: గణేష్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ APEPDCL, సూపరింటెండెంట్ ఇంజనీర్, శ్రీమతి బి. రాజేశ్వరి తెలిపారు. సెప్టెంబరు 14 నుంచి 22 వరకు గ్రామీణ ప్రాంతాల్లో 3KW, పట్టణాల్లో 5KW వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు.
ఆసక్తిగల నిర్వాహకులు దరఖాస్తులను పూర్తి చేసి స్థానిక AEలకు అందజేయాలన్నారు. విద్యుత్ సిబ్బంది మండపాలకు వచ్చి ఉచితంగా లైను వేసి మీటరు బిగిస్తారని, డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని ఆమె సూచించారు.




