Rampachodavaram: గంగవరం మండలం నెల్లిపూడిలో టీడీపీలోకి భారీ చేరికలు!
Rampachodavaram: రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషా దేవి సమక్షంలో గంగవరం మండలం నెల్లిపూడికి చెందిన బుడ్డిగ సతీష్ గౌడ్ మరో 50 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
Rampachodavaram: గంగవరం మండలం నెల్లిపూడిలో టీడీపీలోకి భారీ చేరికలు!
రంపచోడవరం: రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన బుడ్డిగ సతీష్ గౌడ్, సతీష్ గౌడ్ తో పాటు మరో 50 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... పార్టీ ఆదేశాల మేరకు బుడ్డిగ సతీష్ గౌడ్ పార్టీలో చేరడం శుభపరిణామం అని అన్నారు. సతీష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేస్తానని అన్నారు.
పార్టీలో తను పదవులను ఆశించి రాలేదని తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వచ్చానని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ లో పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి,నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.




