Gokavaram: గోకవరంలో సాధువుల వేషంలో గంజాయి రవాణా.. ఇద్దరు నిందితుల అరెస్ట్
Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో సాధువుల వేషంలో 10 కిలోల గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి నగదు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
Gokavaram: గోకవరంలో సాధువుల వేషంలో గంజాయి రవాణా.. ఇద్దరు నిందితుల అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లా: గోకవరంలో గంజాయి పట్టివేత.. సాధువుల వేషంలో రవాణా..గుట్టురట్టు చేసిన పోలీసులు. సాధువుల వేషంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్.10 కిలోల గంజాయి,మొబైల్, రూ.1,500 నగదు స్వాధీనం.
గంజాయి సరఫరా చేస్తున్నారని సమాచారంతో పట్టుకున్న పోలీసులు. చిత్రకొండ నుండి శ్రీశైలం తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తింపు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ,ద్రాక్షారామానికి చెందిన కర్రీ సాయి రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
బత్తుల శ్రీనివాసరావుపై గతంలో రెండు NDPS కేసులు నమోదైనట్లు పోలీసుల వెల్లడి. NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు.




