Mamidikuduru: గ్యాస్ లీక్ బీభత్సం.. మంటల్లో చిక్కుకుని యువతికి తీవ్ర గాయాలు!
Mamidikuduru: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది.
Mamidikuduru: గ్యాస్ లీక్ బీభత్సం.. మంటల్లో చిక్కుకుని యువతికి తీవ్ర గాయాలు!
మామిడికుదురు: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లోని మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వంట గ్యాస్ లీక్ కావడంతో చుట్టుగుళ్ల చంద్రప్రియ (23) అనే యువతి మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడింది.
ఈ ఘటనలో ఆమెకు 99 శాతం కాలిన గాయాలు అయినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది.
Next Story




