Kotipalli: గోదావరి ఉధృతి: ముక్తేశ్వరం - కోటిపల్లి రేవు బంద్

Kotipalli: గోదావరి ఉధృతి: ఎగువన భారీ వర్షాలతో ముక్తేశ్వరం - కోటిపల్లి మధ్య పంటు రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని విజ్ఞప్తి.

RAJU, P GANNAVARAM
Published on: 31 July 2026 11:30 AM IST
Kotipalli
X

Kotipalli: గోదావరి ఉధృతి: ముక్తేశ్వరం - కోటిపల్లి రేవు బంద్

కోటిపల్లి:

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం తీవ్ర రూపం దాల్చడంతో ముక్తేశ్వరం – కోటిపల్లి రేవుల మధ్య నడిచే పంటు (ఫెర్రీ) రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

​గోదావరి వరద నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో పాటు ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవు నిర్వహణాధికారులు తెలిపారు. నిత్యం ఈ రేవు ద్వారా ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరారు. ‌​గోదావరి తీర ప్రాంత ప్రజలు అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story