Pasarlapudilanka: పాశర్లపూడిలంకలో రూ.6.50 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ!

Pasarlapudilanka: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడిలంక శ్రీ నవ బాల కనకదుర్గ అమ్మవారు దేవీ నవరాత్రుల్లో భాగంగా మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు.

PRABHU, RAZOLE
Updated on: 17 Oct 2026 9:24 AM IST
Pasarlapudilanka
X

Pasarlapudilanka: పాశర్లపూడిలంకలో రూ.6.50 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ!

Pasarlapudilanka: అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ నవ బాల కనకదుర్గ అమ్మవారు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శనివారం మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని రూ.6,50,001 విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు.

దేవీ నవరాత్రి ఉత్సవాలతో పాటు ఆలయంలో నిర్వహిస్తున్న ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ విశేష అలంకరణ చేపట్టారు. కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించిన అమ్మవారి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, అర్చకులు ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. మహాలక్ష్మి దేవి అలంకరణతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో సందడిగా మారింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE