Gokavaram: గోకవరంలో మహిళపై అత్యాచార యత్నం, నిందితుడు అరెస్ట్
Gokavaram: గోకవరం మండలం మల్లవరంలో మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్. రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్.
Gokavaram: గోకవరంలో మహిళపై అత్యాచార యత్నం, నిందితుడు అరెస్ట్
గోకవరం: గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన ఓ మహిళకు అదే గ్రామానికి చెందిన గండ్రెడ్డి గోవిందు అనువాడు వికలాంగుల పెన్షన్ మంజూరుకు వికలాంగుల ధృవీకరణ పత్రం చేయిస్తా అని నమ్మించి, భూపతిపాలెం గ్రామ శివారుకు తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడగా బాధిత మహిళ ఫిర్యాదు మేరకు మహిళా ఎస్సై బి. నాగమణి కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
అనంతరం నిందితుడిని రాజమహేంద్రవరం 1వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచగా, న్యాయస్థానం నిందితుడికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఐ. మాట్లాడుతూ, మహిళలు మరియు చిన్నారులపై ఎవరైనా దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు లేదా ఇతర అఘాయిత్యాలకు పాల్పడే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదే విధంగా మండల పరిధిలో మహిళలు లేదా చిన్నారులపై ఎలాంటి దాడులు, వేధింపులు లేదా అఘాయిత్యాలు జరిగిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర సమాచారం కోసం తన మొబైల్ నంబర్ 9440904830 ను సంప్రదించాలని సూచించారు.




