Gokavaram: మహిళల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం: కంబాల శ్రీనివాసరావు!
Gokavaram: గోకవరం డ్రైవర్స్ కాలనీలో దసరా సందర్భంగా కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 155 మంది మహిళలు పాల్గొన్నారు.
Gokavaram: మహిళల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం: కంబాల శ్రీనివాసరావు!
గోకవరం: దేవీ నవరాత్రి మహోత్సవాలు, విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, గోకవరం డ్రైవర్స్ కాలనీలో మంగళవారం ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కాలనీ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగు రంగుల ముగ్గులతో కాలనీ సందడిగా మారింది.
దసరా పండుగ సందర్భంగా మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, సంప్రదాయ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కంబాల శ్రీనివాసరావు ఈ ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 155 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని, వివిధ రంగులతో అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు.
సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ముగ్గులను ఆధునిక రంగుల సమ్మేళనంతో ఆకర్షణీయంగా రూపొందించి, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మహిళలు ప్రదర్శించిన ముగ్గులను కంబాల శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించారు. అనంతరం న్యాయనిర్ణేతలు ముగ్గులను పరిశీలించి, వాటి రూపకల్పన, రంగుల వినియోగం, ఆకర్షణీయత తదితర అంశాల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు.
ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు కంబాల శ్రీనివాసరావు తన ఆర్థిక సహకారంతో ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి సాధించిన దాపారపు హన్సికకు వాషింగ్ మిషన్, రెండో బహుమతి విజేత సమ్మెట్ల ధన్వికకు గ్రైండర్, మూడో బహుమతి విజేత వెళ్లమశెట్టి శిరీషకు మిక్సీ, నాలుగో బహుమతి విజేత కొమ్మిరెడ్డి సంతోషికి ఎలక్ట్రిక్ కుక్కర్‌ను అందజేసి, వారిని అభినందించారు.
విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న 150 మంది మహిళలకు ప్రత్యేక బహుమతులతో పాటు ఒక్కొక్కరికి రూ.500 నగదును పంపిణీ చేశారు. అనంతరం కాలనీ ప్రజలు కంబాల శ్రీనివాసరావుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పండుగల సందర్భంగా మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, సంప్రదాయ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, ఇటువంటి కార్యక్రమాలు వారిలో ఉత్సాహాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సాధారణంగా పోటీల్లో విజేతలకు మాత్రమే బహుమతులు అందజేయడం ఆనవాయితీగా ఉంటుందని, అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళను ప్రోత్సహిస్తూ కంబాల శ్రీనివాసరావు నగదు, ప్రత్యేక కానుకలు అందించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ మహిళలు, యువత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




