Gokavaram: నెల గడిచినా అందని స్కూల్ కిట్లు.. విద్యార్థుల అవస్థలు!

Gokavaram: పాఠశాలలు ప్రారంభమై నెల గడిచినా విద్యార్థులకు యూనిఫాంలు, బ్యాగులు, షూస్ అందకపోవడంపై వైఎస్సార్‌సీపీ నేత సుంకర వీరబాబు మండిపడ్డారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 5 July 2026 2:51 PM IST
Gokavaram
X

Gokavaram: నెల గడిచినా అందని స్కూల్ కిట్లు.. విద్యార్థుల అవస్థలు!

గోకవరం: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ, విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, షూస్ ఇంకా పూర్తిస్థాయిలో అందకపోవడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందజేస్తామని ప్రకటించినప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ పంపిణీ పూర్తికాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

దీంతో విద్యార్థులు పాత యూనిఫాంలు, పాడైన బ్యాగులు, షూస్‌తోనే పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ విషయంపై రాష్ట్ర వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ రాజ్ విభాగం జాయింట్ సెక్రటరీ సుంకర వీరబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించాల్సిన ప్రాథమిక సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు.

పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా యూనిఫాంలు, బ్యాగులు, షూస్ అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న యూనిఫాంలు, బ్యాగులు, షూస్ పంపిణీ పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల చదువుకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను తక్షణమే కల్పించాలని ఆయన కోరారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story