Gokavaram: గోకవరం హైస్కూల్‌లో మందుబాబుల న్యూసెన్స్.. కేసు నమోదు

Gokavaram: గోకవరం జడ్పీ హైస్కూల్ ఆవరణలో మద్యం సేవించి రచ్చ చేసిన ఆకతాయిలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 9 July 2026 7:00 AM IST
Gokavaram
X

Gokavaram: గోకవరం హైస్కూల్‌లో మందుబాబుల న్యూసెన్స్.. కేసు నమోదు

Gokavaram: గోకవరం గ్రామం జడ్‌.పి హైస్కూల్ ప్రాంగణంలో మద్యం సేవించి ప్రజలకు, విద్యార్థులకు అసౌకర్యం కలిగించే విధంగా న్యూసెన్స్ సృష్టిస్తున్న కొందరు వ్యక్తులపై గోకవరం ఎస్సై వి.ఎన్.వి.పవన్ కుమార్ 292 బి.ఎన్.ఎస్ కింద కేసు నమోదు చేసినట్లు, అదేవిధంగా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, గోకవరం వారి వద్ద బౌండ్ ఓవర్ చేసినట్లు బుధవారం తెలిపారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, కాలేజీలు ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి, న్యూసెన్స్ సృష్టించి, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని, ముఖ్యంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రజా ప్రదేశాల పరిసరాల్లో ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబడవని,

ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించడం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గమనించిన వెంటనే తన ఫోన్ నెం.: 9440904830 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story