Gokavaram: గోకవరం 700 మంది మహిళలకు పట్టుచీరల పంపిణీ
Gokavaram: గోకవరంలో ఘనంగా కంబాల కానుక వేడుక. ఇర్లంకపల్లి, పెంటపల్లి గ్రామాల్లో 700 మంది మహిళలకు పట్టుచీరలు అందజేసిన బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు.
Gokavaram: గోకవరం 700 మంది మహిళలకు పట్టుచీరల పంపిణీ
గోకవరం: గోకవరం మండలం ఇర్లంకపల్లి, పెంటపల్లి గ్రామాలలో గురువారం రాత్రి నిర్వహించిన కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రకమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని రెండు గ్రామాలకు చెందిన మహిళలకు 700 పట్టు చీరలను ఉచితంగా పంపిణీ చేశారు.
తొలిత కంబాల శ్రీనివాసరావు వీర్లంకపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించారు. గ్రామంలో పలు ఆలయాలను దర్శించుకుని, పూజలు నిర్వహించి, అమ్మవారికి తొలి చీరను అందజేశారు. వీర్లంకపల్లి గ్రామంలో 230 మంది మహిళలకు పట్టు చీరలను ఉచితంగా పంపిణీ చేసారు.
అనంతరం పెంటపల్లి గ్రామాన్ని సందర్శించి, గ్రామంలో ఆలయాలను దర్శించుకున్నారు. పెంటపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో 470 మంది మహిళలకు ఉచితంగా పట్టు చీరలను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల సంక్షేమం ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
సమాజంలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మహిళలకు అండగా నిలుస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం, అభిమానంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ, సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




