Gokavaram: గోకవరంలో అయ్యప్ప స్వాములకు ముక్కోటి అన్నదాన సేవ ప్రారంభం

Gokavaram: గోకవరంలో అయ్యప్ప స్వాములకు మండల దీక్ష ముగిసే వరకు ఉచిత అన్నదాన సేవలను ప్రారంభించిన ఆధ్యాత్మికవేత్త, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు.

NARAYANA, RAJANAGARAM
Published on: 4 Nov 2026 5:48 PM IST
Gokavaram
X

Gokavaram: గోకవరంలో అయ్యప్ప స్వాములకు ముక్కోటి అన్నదాన సేవ ప్రారంభం

గోకవరం: అయ్యప్ప స్వాములకు ఆధ్యాత్మిక సేవే లక్ష్యంగా, స్వాములకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మండల దీక్ష పూర్తయ్యే వరకు నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు ముందుకు వచ్చారు.

ఇందులో భాగంగా గోకవరం స్థానిక సత్యకృష్ణ కల్యాణ మండపం (కళాభారతి)లో అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేసిన బిక్ష కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. తొలుత అర్చకులు అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు, నిర్వహించారు.

అనంతరం కంబాల శ్రీనివాసరావు స్వయంగా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదాలను వడ్డించి బిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల మండల దీక్ష పూర్తయ్యే వరకు ప్రతిరోజూ మూడు పూటలా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం బిక్ష, రాత్రి వడి కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా, నియమనిష్టలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వాములకు రుచికరమైన వివిధ రకాల వంటకాలను సిద్ధం చేసి, భక్తితో అన్నప్రసాదాలను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

గత మూడేళ్లుగా ఇదే విధంగా అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ ఏడాది కూడా అదే సేవా స్ఫూర్తితో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. అయ్యప్ప స్వాముల మండల దీక్ష సమయంలో వారికి అవసరమైన ఆహార సదుపాయాలు కల్పించడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని కంబాల శ్రీనివాసరావు అన్నారు.

స్వాములందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. అయ్యప్ప స్వాములకు మూడు పూటలా అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం పట్ల స్వాములు హర్షం వ్యక్తం చేశారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM