Gokavaram: 'బంగారు వరలక్ష్మి కానుక'.. 370 మంది మహిళలకు బంగారు రూపులు!

Gokavaram: 'బంగారు వరలక్ష్మి కానుక' లక్కీ డ్రాకి మంచి స్పందన వచ్చింది. విజేతలైన 370 మంది మహిళలకు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు దంపతులు బంగారు రూపులిచ్చారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 6 Aug 2026 10:10 AM IST
Gokavaram
X

Gokavaram: 'బంగారు వరలక్ష్మి కానుక'.. 370 మంది మహిళలకు బంగారు రూపులు!

గోకవరంలో బంగారు వరలక్ష్మి కానుక సీజన్-4 విశేషా స్పందన ....

డ్రాలో గెలిపొందిన 370 మంది మహిళలకు ఉచితంగా వరలక్ష్మి రూపులు పంపిణీ..

గోకవరం- రాజమండ్రి వెళ్లే రహదారిలోని విజయ గార్డెన్ ఫంక్షన్ హల్ లో రెండో రోజు మంగళవారం సాయంత్రం జరిగిన బంగారు వరలక్ష్మి కానుక సీజన్-4 లక్కీ డ్రా కార్యక్రమానికి మహిళల నుంచి విశేషా స్పందన లభించింది. తొలితగా విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి దేవి గంగారత్నం దంపతులు వరలక్ష్మి దేవి అమ్మవారి పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వాలన చేసి లక్కీ డ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి అర్చకులు పూర్ణ కలశంతో ఘన స్వాగతం పలికి, వేదమంత్రాలతో ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్బంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మన ధర్మాన్ని పరిరక్షించాలని, మహిళా మూర్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో, శ్రావణ మాసంలో మహిళలు ఎంతో సంతోషంగా వరలక్ష్మి పండుగను జరుపుకోవాలనే బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేషా స్పందన లభించిందన్నారు. మహిళాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను, ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. అనంతరం గోకవరం మండలానికి చెందిన తంటికొండ, రంపయర్రం పాలెం, అచ్చుతాపురం, మల్లవరం, దేవిపట్నం ఆర్.అండ్.ఆర్ కాలనీ, కామరాజు పేట, కొత్తపల్లి, మొల్లేరు, గోపాలపురం ఇటికాయలపల్లి, తిరుమలయపాలెం, ఠాగూర్ పాలెం, జగన్నాధపురం, గుమళ్ళదొడ్డి, గంగంపాలెం, వెదురుపాక, బావోజిపేట, పెంటపల్లి, కృష్ణునిపాలెం, నెల్లిపూడి, రాజుపాలెం, గాదెల పాలెం, వీర్లకపల్లి గ్రామాలకు చెందిన మహిళలకు లక్కీ డ్రా నిర్వహించారు. డ్రాలో గెలిపొందిన 370 మంది మహిళలకు కంబాల శ్రీనివాసరావు, దంపతులు బంగారు వరలక్ష్మి రూపులను ఉచితంగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు....

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story