Gokavaram: గోకవరంలో 6 కేజీల లిక్విడ్ గంజాయి పట్టివేత
Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో రూ. 75 లక్షల విలువైన 6 కేజీల లిక్విడ్ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
Gokavaram: గోకవరంలో 6 కేజీల లిక్విడ్ గంజాయి పట్టివేత
గోకవరం: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 6 కేజీల లిక్విడ్ గంజాయిని గోకవరం పోలీసులు పట్టుకున్నారు. నిందితురు లిక్విడ్ గంజాయిను ఒరిస్సా ప్రాంతంలో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలించి,విక్రయించేందుకు తీసుకు వెళుతున్నారని, పోలీసులకు అనుమానం రాకుండా ముందుగా బైకుపై ఇద్దరు వ్యక్తులను పంపి పోలీసుల కదలికలను గమనించి షిఫ్ట్ కారులో తరలించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కోరుకొండ నార్త్ జోన్ డిఎస్పి జీవన తెలిపారు.
ఈ తరలింపులో ఒడిశా రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా నుండి ఒకరు,తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నుండి నుండి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా నుండి నుండి ఒకరు పట్టు పడ్డారని, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని గతంలో వీరిపై కేసులు ఉన్నాయని డి.ఎస్.పి తెలిపారు.
గత సంవత్సరం నుండి ఇప్పటివరకు 7 కేసుల్లో సుమారు 20 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 600 కేజీలకు గంజాయిని స్వాధీనపరచుకోవడమైనదని, అదేవిధంగా సుమారు 20 మందికి రాపిడ్ టెస్టులు నిర్వహించి, వారిని కౌన్సిలింగ్ సెంటర్ కు,డి అడిక్షన్ సెంటర్ కు తరలించడమైనదని డి.ఎస్.పి తెలిపారు.
గోకవరం స్టేషన్ పరిధిలో గంజాయి నిర్మూలనకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్వీఎస్ఎన్ మూర్తి ఎస్సై పవన్ కుమార్, స్టేషన్ సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబరిచారని అభినందించారు. సిబ్బందికి రివార్డులు అందించారు.




