Gokavaram: భూపతిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

Gokavaram: గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 9 Sept 2026 11:53 PM IST
Gokavaram
X

Gokavaram: భూపతిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

గోకవరం: గోకవరం మండలం భూపతి పాలెం ప్రభుత్వ బాలుర రియడెన్సియల్ స్కూల్ నందు విద్యార్థులకు జి. కొత్తపల్లి పి .హెచ్. సి.వైద్యాధికారి డా.తిరన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపాల్ జి. అశోక్ కుమార్ సమక్షంలో విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలు మరియు మంచి ఆరోగ్య అలవాట్లు దోమతెరలు ఏవిధంగా ఉపయోగించాలో తెలిపారు.

ప్రస్తుత సీజన్ లో వచ్చే జ్వరాలు డెంగ్యూ, చికెన్ గున్య, మలేరియా వంటి వ్యాధులు బారినపడకుండా పరిసరాలు పరిశుభ్రత అవసరమని ప్రతీ వారం ఫ్రైడే డ్రైడే పాటించాలని తెలిపారు.

త్రాగునీటి పరిశుభ్రత మరియు పౌష్టికాహారం గురించి ఆరోగ్య విద్య జరిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్. ఎల్. హెచ్. పి లు దినేష్,కుమారస్వామి ఎ. పి. హెచ్. ఏ. ఆచారి నర్స్ గ్రేస్ తదితరులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story