Gokavaram: అంబటి వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నిరసన
Gokavaram: హోంమంత్రి వంగలపూడి అనితపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన గోకవరం మండల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు. క్షమాపణ చెప్పాలని డిమాండ్.
Gokavaram: అంబటి వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నిరసన
గోకవరం: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎం.ఆర్.పి.ఎస్ గోకవరం మండల శాఖ తీవ్రంగా ఖండించింది.ఈ సందర్భంగా ఎం.ఎస్.పి మండల అధ్యక్షులు గరభారపు శ్రీనివాస్ మాదిగ మరియు ఎం.ఆర్.పి.ఎస్ మండల అధ్యక్షులు చాపల సూరిబాబు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర హోం మంత్రి అనిత పై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
అంబటి రాంబాబు తక్షణమే ఆయన చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకొని, అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు ఇటువంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని లేని పక్షంలో ఆయనకు తగిన గుణపాఠం చెబుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితకు తక్షణమే క్షమాపణ చెప్పకుంటే పోరాటానికి సిద్ధమని ఈ సందర్భంగా శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.పి ఉపాధ్యక్షులు రామవరపు రాజేష్, ప్రధాన కార్యదర్శి పులుగుర్తి రాములు, చింతాటి వెంకన్న, గున్నూరి లాజర్, అరసాల మోహన్, మార్త సోమరాజు, అరసాల శ్రీను, బొడ్డపాటి చిన్ని, బొద్దాని బాపిరాజు, చింతాటి చిట్టయ్య, అరసాల వెంకన్న, గొర్త ప్రభుదాసు, కందుకూరి నాగరాజు, చింతాటి ఏసు, దొండపాటి చినబాబు, వంగలపూడి శ్రీను, తోలేటి దావీదు, దొండపాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




