Gokavaram: గోకవరంలో తాళాలు పగలగొట్టి దొంగతనాలు: నలుగురి అరెస్ట్
Gokavaram: గోకవరం మండలం వీర్లంకపల్లి జంక్షన్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డ నలుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 7 బైక్లను కోరుకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Gokavaram: గోకవరంలో తాళాలు పగలగొట్టి దొంగతనాలు: నలుగురి అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలం వీర్లంక పల్లి జంక్షన్ వద్ద సెప్టెంబర్ 5న తాళాలు పగులు కొట్టి దొంగతనం చేసిన కేసులు నలుగురు వ్యక్తుల అరెస్ట్. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి బట్టలు, కళ్ళజోళ్ళు దొంగలించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపిన కోరుకొండ సిఐ ఎస్ వి వి ఎస్ మూర్తి.
అదుపులోకి తీసుకున్న వారిలో నిందితులు కీలు శివ (19), కామకుల వినయ్@గుండు (20) లతోపాటు ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలిపిన పోలీసులు. విచారణలో నిందితులు సెప్టెంబర్ 18న వీర లంకపల్లి జంక్షన్ సమీపంలో టీ షాప్ లో తాళాలు పగలగొట్టి 5000 నగదు,సిగరెట్లు దొంగలించినట్లు తేలింది అన్న పోలీసులు.
వారి వద్ద నుండి ఏడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వ్యవహరించిన పోలీసులు.. ముద్దాయిలపై అడ్డతీగల, రంపచోడవరం, రాజానగరం పోలీస్ స్టేషన్లలో పాత కేసులు ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు.




