Gokavaram: గోకవరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు
Gokavaram: గోకవరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Gokavaram: గోకవరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు
Gokavaram: గోకవరంలోట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమ య్యారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే వాహనదారులతో పాటు అవసరమైతే సంబంధిత షాపు యజమానులపైనా చర్యలు తీసుకుంటామని గోకవరం ఎస్సై బి. నాగమణి హెచ్చరించారు.
ఆమె మాట్లాడుతూ గోకవరం ప్రధాన రహదారి, పాత బస్టాండ్, ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్, దేవి చౌక్ సెంటర్ తో పాటు వాణిజ్య సముదాయాల పరిసరాల్లో విచ్చలవిడిగా వాహనాలు పార్క్ చేయడం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు, పాదచారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ట్రాఫిక్ సమస్యలపై ప్రజల నుంచి పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమెవెల్లడించారు. దుకాణాలకువచ్చేవిని యోగదారులు తమ వాహనాలను రహదారుల పైనే నిలి పివేయడం వల్ల ట్రాఫిక్ తీవ్రత మరింత పెరుగుతోందని చెప్పారు.
నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపివేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసిన ఎస్సై నాగమణి, ట్రాఫికు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత వ్యాపారసంస్థలయజమానుల పైనా చర్యలు ఉంటాయని తెలిపారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆమె, ట్రాఫిక్ నియంత్రణలో ప్రజలు సహకరిం చాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గోకవరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పోలీసులు త్వరలో మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.




