Gokavaram: ప్రెస్ క్లబ్ దివంగత అధ్యక్షుడు రౌతు పండు విగ్రహ ఆవిష్కరణ!
Gokavaram: గోకవరం ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు దివంగత రౌతు పండు విగ్రహ ఆవిష్కరణ బుధవారం ఘనంగా జరిగింది. రాజకీయ నేతలు, విలేకరులు నివాళులర్పించారు.
Gokavaram: ప్రెస్ క్లబ్ దివంగత అధ్యక్షుడు రౌతు పండు విగ్రహ ఆవిష్కరణ!
Gokavaram: గోకవరం దివంగత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రౌతు పండు విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు, అభిమానులు, ప్రెస్ క్లబ్ సభ్యులు భారీగా తరలివచ్చారు. వీరి నడుమ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు.
అనంతరం వీరంతా పండు విగ్రహానికి పూలమాలలు వేసి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వీరందరూ మాట్లాడుతూ పండుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పండు లేని లోటు తీర్చలేనిదంటు కన్నీటి పర్యాంతమయ్యారు. విలేకరులందరిని ఒకే తాటిపై తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపనలో ఆయన చేసిన కృషిని, తమకు అందించిన తోర్పాటును ప్రెస్ క్లబ్ సభ్యులు గుర్తు చేసుకున్నారు.
Next Story




