Gokavaram: గోకవరం గద్దెలో చదువుల తల్లికి చిన్నారుల శతకోటి సరస్వతి పూజలు!
Gokavaram: గోకవరం కనకదుర్గమ్మ ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా 400 మంది చిన్నారులతో సరస్వతి పూజలు జరిగాయి. పూజలో పాల్గొన్న పిల్లలకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు.
Gokavaram: గోకవరం గద్దెలో చదువుల తల్లికి చిన్నారుల శతకోటి సరస్వతి పూజలు!
గోకవరం: గోకవరం లోని శ్రీ వీరభద్రుని గద్దె లో వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరవరోజు అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయమంతా కంచర్ల నరసింహమూర్తి గారి మరియు వారి కుమారులు సూర్య ప్రకాష్ ,నాగేశ్వరావు గారి కుటుంబ సభ్యులచే పుష్ప మరియు పండ్ల రకాలతో అలంకరణ చేయించారు
అమ్మవారి సరస్వతి అలంకారం కావడంతో గద్దె లో సుమారు 400 మంది పైగా చిన్నారులతో అందరితో ఆలయ అర్చకులు కిట్టు శర్మ, కృష్ణ శర్మల చే చిన్నారులు సరస్వతి పూజ నిర్వహించారు.
ఈ విధంగా చిన్నారుల సరస్వతి పూజ చేయడం వలన చిన్నారులు మంచి జ్ఞానంతో పాటు విద్య అభివృద్ధి ఆయుష్షు ఆరోగ్యం కలుగుతాయని నమ్మకంతో ప్రతి సంవత్సరం ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి దీవెనలు పొందుతారు అన్నారు. సరస్వతి పూజలో కూర్చున్న చిన్నారులకు సభ్యుల సహకారంతో అమ్మవారి ప్రతిమ పుస్తకాలు పెన్నులు బిస్కెట్ ప్యాకెట్లు రబ్బరుల , ఎగ్జామ్ ప్యాడ్ అందించారు. అనంతరం చిన్నారులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
మూలా నక్షత్రం కావడంతో అమ్మవారికి భక్తులు తెల్లవారుజామునండి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు.




