Gokavaram: తంటికొండలో వైభవంగా రాధాకృష్ణ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు

Gokavaram: తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో నూతన రాధాకృష్ణ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

NARAYANA, RAJANAGARAM
Published on: 21 Jun 2026 9:40 PM IST
Gokavaram
X

Gokavaram: తంటికొండలో వైభవంగా రాధాకృష్ణ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు

Gokavaram: గోకవరం మండలం తంటికొండ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న రాధాకృష్ణ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కై పూజలు నిరంతరంగా నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా రెండు రోజులుగా నిత్యం పూజలు హామాలో నిర్వహించ బడుతున్నాయి. టిడిపి మండల నాయకులు దాసరి సీతారామకృష్ణ దంపతులు ఎంతో నియమ నిష్టలతో పీటలపై కూర్చొని దేవునికి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ఆర్థిక సహాయం అందించారు. , రెందు రోజుల నుండి నిరంతరగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. వీరితో పాటుగా బద్దిరెడ్డి శ్రీకృష్ణ దంపతులు, బద్దిరెడ్డి కార్తీక్ దంపతులు ఈ ప్రతిష్టకు సంబందించిన పీటలు మీద కూర్చుని పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణ మందిరం సంబందించిన కమిటీ ఆధ్వర్యంలో రాధ, కృష్ణ విగ్రహాలు, వినాయక విగ్రహం,

లక్ష్మిదేవి విగ్రహం ప్రతిష్ఠ నేడు అనగా 22వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రతిష్ట జరపబడునున్నదని కమిటీ తెలియపరిచింది. అందులో భాగములో గణపతి పూజ, పుణ్యవహచన ,రక్షాబంధన , పరిషత్ప్ర ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రధాన, యాగశాల ప్రవేశం, మడప ఆవాహన, ఆరాధన,అగ్ని మథనం, సర్వతోభద్ర మండప దేవత ఆరాధన హోమాలు తదితర కార్యక్రమాలు ఆదివారం నాడు జరిగినవి. నేడువిగ్రహ ప్రతిష్ఠ అనంతరం గొప్ప అన్న సమారాధన జరగనున్నదని కమిటీ పెద్దలు తెలిపారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story