Gokavaram: మేకలు మేపుకుంటున్న మహిళపై దాడి, అత్యాచారం

Gokavaram: గోకవరం మండలం బావోజిపేటలో మేకలు మేపుకుంటున్న మహిళపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన దుండగుడు. పోలీసుల దర్యాప్తుు.

NARAYANA, RAJANAGARAM
Published on: 11 Sept 2026 11:47 PM IST
Gokavaram
X

Gokavaram: మేకలు మేపుకుంటున్న మహిళపై దాడి, అత్యాచారం

గోకవరం: గోకవరం మండలం బావోజిపేట గ్రామ సమీపంలోని పోలవరం కాలువ వద్ద మేకలు మేపుకుంటున్న మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడి, అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకోగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బావోజిపేట గ్రామానికి చెందిన 38 ఏళ్ల మహిళ పోలవరం కాలువ సమీపంలో మేకలు మేపుకుంటుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి సమీపంలోని అసాగో ఫ్యాక్టరీకి వెళ్లే మార్గాన్ని అడిగాడు. తాను అక్కడ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నానని చెప్పడంతో ఆమె అతనికి దారి చూపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొంతదూరం వెళ్లిన అనంతరం ఆ వ్యక్తి తిరిగి వచ్చి మహిళపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ప్రతిఘటించడంతో అక్కడ ఉన్న ఇనుప రాడ్‌ను తీసుకుని ఆమెపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో ఆమె తల, నుదురు, మణికట్టు, మోచేతి ప్రాంతాల్లో గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలు సమీపంలోని బంధువు ఇంటికి చేరుకుని అక్కడ కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను తొలుత గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM