Gokavaram: పేదల గుండెల్లో వైఎస్సార్ ఒక చెరగని జ్ఞాపకం ఎంపీపీ శ్రీవల్లి

Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.

NARAYANA, RAJANAGARAM
Published on: 8 July 2026 9:55 PM IST
Gokavaram
X

Gokavaram: పేదల గుండెల్లో వైఎస్సార్ ఒక చెరగని జ్ఞాపకం ఎంపీపీ శ్రీవల్లి

గోకవరం: మండల కేంద్రమైన గోకవరం పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీమంత్రి, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం తనయులు ఉభయగోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీ రాంజీ పాల్గొని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీ,బాలింతలు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట శ్రీరాంజీ మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖంలో చెరగని చిరునవ్వు, నడకలో తెలుగుదనం ఉట్టు పడే రాజసం, పేదల గుండెల్లో ఎప్పటికీ జరగని జ్ఞాపకం మన అభివృద్ధి ప్రదాత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.

ప్రజా సంక్షేమ పాలనకు సరికొత్త భాష్యం చెప్పిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన చేసిన అభివృద్ధి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందని తెలిపారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ పథకం సృష్టికర్త డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అనికొనియాడారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చినబాబు, సుంకర రమణ, పాటి రాంబాబు, అక్షింతల రాజా, నరాల శెట్టి నరసయ్య, మడికి మైనర్ బాబు,నున్నం రాంబాబు, రౌతు జోగేశ్వరరావు, అంబటి అబ్రహం, బిజ్జి రాజు, జాజుల ప్రసాద్, కూరాకుల సుమంగళి, బాడితబోయిన చిన్న, మచ్చ మురళి, మత్తి రాజేశ్వరి, జాలెం రాము, దంగేటి వెంకటరత్నం, అడబాల అబ్బులు, తొట్ట సత్యనారాయణ, కాటమస్వామి, నండూరి బుజ్జి, బొర్రా శేఖర్, షేక్ నాగూర్ వల్లి బాబా, దివానం తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story