Gokavaram: గోకవరంలో వైఎస్సార్‌సీపీ ‘వెన్నుపోటు పాలనపై పోరు’ సభ!
Gokavaram: గోకవరంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 'వెన్నుపోటు పాలనపై పోరు': కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి తోట నరసింహం ధ్వజం. స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్ సిద్ధం కావాలని పిలుపు.
Gokavaram: గోకవరంలో వైఎస్సార్‌సీపీ ‘వెన్నుపోటు పాలనపై పోరు’ సభ!
గోకవరం: గోకవరం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు ప్రభుత్వం వెన్నుపోటు పాలనపై పోరు కార్యక్రమాన్ని గోకవరం గోపికృష్ణ ఫంక్షన్ హాల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాటి రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, మరియు మాజీపార్లమెంటు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలపై ప్రజల్లో ఆవేదన అసంతృప్తి నెలకొన్నాయని పేర్కొన్నారు. ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
చంద్రబాబు నాయుడు పై గతంలో ఉన్న వెన్నుపోటు రాజకీయాల ప్రస్తావనను ఆయన ప్రస్తావించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విధానాలను వివారిస్తామని తెలిపారు. జిల్లా లో వివిధ ప్రాంతాల్లో సర్పంచ్ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతామని తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ ఐడెంటి కార్డులను నాయకులు, కార్యకర్తలుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలం, గ్రామ,అనుబంధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




