Razole: రాజోలులో 36 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Razole: రాజోలులో 36 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య.

PRABHU, RAZOLE
Published on: 28 Aug 2026 3:41 PM IST
Razole
X

Razole: రాజోలులో 36 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Razole: అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా కూటమి ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు.రాజోలు మండలం శివకోటి గ్రామంలోని టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం 44వ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘కేడర్‌ విత్‌ లీడర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహిస్తున్న ‘కేడర్‌ విత్‌ లీడర్‌’ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణుల సమస్యలతో పాటు గ్రామాల్లోని ప్రజా సమస్యలను తెలుసుకునే అవకాశం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన చెక్కులను నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. డోర్‌టు డోర్‌ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసేందుకు కృషి చేసిన వారిని అమూల్య అభినందించారు.

అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, కూటమి శ్రేణుల నుంచి అమూల్య అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మూడు అర్జీలు, సీఎంఆర్‌ఎఫ్‌ కోసం 11 అర్జీలు అందాయి. కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి టీడీపీ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, యువ నాయకులు, సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story