Razole: దిండిలో 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ గొల్లపల్లి అమూల్య!

Razole: మలికిపురం మండలం దిండిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య.

PRABHU, RAZOLE
Published on: 1 Sept 2026 10:25 AM IST
Razole
X

Razole: దిండిలో 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ గొల్లపల్లి అమూల్య!

Razole: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం దిండి గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అమూల్య పెన్షన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించిన ఆమె వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతున్న తీరును పరిశీలించారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎంతో భరోసా కల్పిస్తున్నాయని అమూల్య పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

పేద ప్రజల సంక్షేమం, సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆమె అన్నారు. ప్రతి నెలా పెన్షన్లను లబ్ధిదారులకు సకాలంలో అందించడం ద్వారా వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

పెన్షన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. తమ వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడం పట్ల ప్రభుత్వానికి, కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story