Razole: రాజోలులో నిరుపేదకు రూ.1.02 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ అందజేత

Razole: రాజోలుకు చెందిన కిడ్నీ బాధితుడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1.02 లక్షల ఎల్ఓసీ మంజూరు. పత్రాలను లబ్ధిదారునికి అందజేసిన గొల్లపల్లి అమూల్య.

PRABHU, RAZOLE
Published on: 2 July 2026 4:46 PM IST
Razole
X

Razole: రాజోలులో నిరుపేదకు రూ.1.02 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ అందజేత

రాజోలు: డాక్టర్ .బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు గ్రామానికి చెందిన తోలేటి మణి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.1.02 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మంజూరైంది.

స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయాన్ని రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య దృష్టికి తీసుకెళ్లగా, ఆమె స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,02,000 ఎల్ఓసీ మంజూరు అయ్యేలా కృషి చేశారు. గురువారం పొదలాడలో నిర్వహించిన కార్యక్రమంలో తోలేటి మణీ కుమారుడు హేమంత్‌కు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పత్రాలను అమూల్య అందజేశారు.

ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన గొల్లపల్లి అమూల్యకు తోలేటి మని కుటుంబ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story