Sakhinetipalli: సఖినేటిపల్లిలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం.. గొల్లపల్లి అమూల్య

Sakhinetipalli: కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో వీబీజీ రాంజీ పథకాన్ని ప్రారంభించిన గొల్లపల్లి అమూల్య. ఉపాధి హామీ దినాలు 125 రోజులకు పెంపు అని వెల్లడి.

PRABHU, RAZOLE
Published on: 2 July 2026 4:18 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: సఖినేటిపల్లిలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం.. గొల్లపల్లి అమూల్య

సఖినేటిపల్లి: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలంలోని టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి గ్రామాల్లో నిర్వహించిన 'VB G RAM G' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాజోలు టిడిపి ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'VB G RAM G' పథకం గ్రామీణ ఉపాధి రంగానికి కొత్త ఊపునిస్తుందని అన్నారు. ఈ పథకం ద్వారా NREGS జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉపాధి దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు, 15 రోజులలోపు వేతనాలు చెల్లించే విధంగా మార్పులు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేసి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని అమూల్య అన్నారు.

కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, మండల పార్టీ అధ్యక్షుడు తాడి సత్యనారాయణతో పాటు పులగం రమేష్, అయినవిల్లి సత్యనారాయణ, ఏడుకొండలు, ఇందుకూరి రమేష్ రాజు, వెలుగొట్ల మల్లేశ్వరరావు, రుద్రరాజు సూరిబాబు రాజు, రావి ధర్మరాజు, ఉండ్రాజవరపు బాబురావు, కొల్లు మహాలక్ష్మి, కొండా కిషోర్, చెల్లుబోయిన నాగబాబు, పంగం సుధాకర్, గొల్ల జస్పాల్, చిగురుపాటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story