Sakhinetipalli: వంగవీటి రంగా జయంతి వేడుకలు నివాళులర్పించిన అమూల్య

Sakhinetipalli: మోరిపోడులో వంగవీటి రంగా 79వ జయంతి వేడుకలు. రంగా విగ్రహానికి పూలమాల వేసిన రాజోలు టీడీపీ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య మరియు కూటమి నాయకులు.

PRABHU, RAZOLE
Published on: 4 July 2026 2:54 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: వంగవీటి రంగా జయంతి వేడుకలు నివాళులర్పించిన అమూల్య

సఖినేటిపల్లి: స్వర్గీయ వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, మోరిపోడు గ్రామంలోని రంగా విగ్రహానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ, ప్రజల కోసం, ముఖ్యంగా కార్మిక వర్గం సంక్షేమం కోసం స్వర్గీయ వంగవీటి మోహన రంగా నిరంతరం పోరాడారని పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలిచిన ఆయన ధైర్యసాహసాలు, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం చిరస్మరణీయమని అన్నారు. రంగా ఆశయాలు, సేవా భావం భావితరాలకు స్ఫూర్తిగా నిలిచి సమాజానికి మార్గదర్శకంగా ఉంటాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భూపతిరాజు సాయిబాబా రాజు, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, మండల టీడీపీ అధ్యక్షుడు అడబాల సాయిబాబా, కాకి లక్ష్మణరావు, గోనిపాటి రాజు, రాపాక నవరత్నం, ముప్పర్తి నాని, బోణం చంటి, రాపాక మహేష్, కడలి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story