Malikipuram: మలికిపురంలో అల్లూరి జయంతి నివాళులర్పించిన అమూల్య!

Malikipuram: కోనసీమ జిల్లా మలికిపురంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. టీడీపీ రాజోలు ఇంచార్జి గొల్లపల్లి అమూల్య నివాళులర్పించారు.

PRABHU, RAZOLE
Published on: 4 July 2026 12:20 PM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురంలో అల్లూరి జయంతి నివాళులర్పించిన అమూల్య!

Malikipuram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు ఇంచార్జి గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, త్యాగనిరతి, పోరాట పటిమ దేశ ప్రజలకు చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు సాయిబాబా రాజు, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, మండల టీడీపీ అధ్యక్షుడు అడబాల సాయిబాబా, కాకి లక్ష్మణరావు, గోనిపాటి రాజు, అడబాల రమాదేవి శేషారావు, రాపాక నవరత్నం, అల్లూరి వెంకట రామరాజు, బోణం చంటి తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story