Razole: రాజోలు 'కేడర్ విత్ లీడర్'లో కూటమి విజయానికి పిలుపు
Razole: రాజోలులో 37వ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. రాబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో పనిచేయాలని ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య పిలుపు.
Razole: రాజోలు 'కేడర్ విత్ లీడర్'లో కూటమి విజయానికి పిలుపు
రాజోలు: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో 37వ వారపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక "కేడర్ విత్ లీడర్" కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య తాటిపాక గ్రామంలోని జీఎస్ గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రతిఫలంగా నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా కీలకమని పేర్కొన్నారు. స్థానిక సంస్థలను కూటమి కైవసం చేసుకుంటే గ్రామాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సులభమవుతుందని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
అనంతరం నియోజకవర్గం లోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, కూటమి నాయకుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యలు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన అర్జీలను పరిశీలన కోసం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, మండల పార్టీ అధ్యక్షులు అడబాల సాయిబాబా, గొనిపాటి రాజు, ఆరుమిల్లి భాను, పులగం రమేష్, అనుచూరి సునీత, రామ పురుషోత్తం, కాండ్రేగుల సత్యనారాయణ, చెల్లింగి సత్యనారాయణ, సర్పంచ్ కోటిపల్లి రత్నమాల, కడలి దుర్గాదేవి రాజేష్, చింతపల్లి నాగలక్ష్మి, నల్లా పరంకుశరావు, కట్టా సూరిబాబు, కడలి నాగేశ్వరరావు, పోతురాజు కృష్ణ, కట్టా వెంకటరాజు, యెనుముల రమణ, యెనుముల సత్యనారాయణ, రామేశ్వరపు వెంకట ప్రభాకర్, పప్పుల రమేష్, పప్పుల శివప్రసాద్, కొండా కిషోర్, జిల్లెళ్ళ వెంకటేశ్వర్లు, జిల్లెళ్ళ పావెల్ రెడ్డి, బోనం చంటి, ఒగ్గు నారాయణమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు.




