Rajahmundry: ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట..ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి!

Rajahmundry: ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లలో బీసీలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 25 Nov 2026 3:41 PM IST
Rajahmundry
X

Rajahmundry: ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట..ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి!

Rajahmundry: ఇటీవల జరుగుతున్న వరుస ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. కడియం విచ్చేసిన ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక నుండి, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రిజర్వేషన్ల లో బీసీలకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

57వ వార్డులో తన సోదరి బుడ్డిగ వెంకటరమణ పోటీ చేస్తున్నారని కడియం మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి ఎమ్మెల్యే గోరంట్ల వద్ద ప్రస్తావించగా ఆయన బీసీలకు కూటమి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.

కడియం పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీ సర్పంచ్ అభ్యర్థి వెలుగుబంటి సత్య ప్రసాద్ విజయానికి కృషి చేయాలని గోరంట్ల అక్కడ ఉన్న క్యాడర్ను కోరారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL