Gokavaram: గోకవరం రైతుల వద్దకే రెవెన్యూ సేవలు - పాసు పుస్తకాల పంపిణీ
Gokavaram: గోకవరంలో ‘ఒక నెల - ఒక గ్రామం’ కార్యక్రమం. రైతుల వద్దకే అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తహశీల్దార్ రామకృష్ణ వెల్లడి. పాసు పుస్తకాల పంపిణీ.
Gokavaram: గోకవరం రైతుల వద్దకే రెవెన్యూ సేవలు - పాసు పుస్తకాల పంపిణీ
గోకవరం: రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ రైతులు తిరగనవసరం లేదని అధికారులే మీ గ్రామాలకు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారని గోకవరం తహసిల్దార్ రామకృష్ణ తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నెల ఒక గ్రామం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ కార్యక్రమంలో రెవిన్యూ సమస్యలకు పరిష్కారం చూపబడుతుందన్నారు.
శనివారం నాడు భూపతిపాలెం స్కూల్ చైర్మన్ గళ్ళ రాము ఆధ్వర్యంలో గాదెలపాలెంలో నిర్వహించిన ఒక నెల ఒక గ్రామం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, టిటిడి బోర్డు మెంబర్, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు తహశీల్ధార్, కూటమి నాయకులు ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
కూటమి నాయకులు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో రెవిన్యూ రికార్డులను గందరగోళంగా ఉండేవని , రైతులు రెవెన్యూ కార్యాలయాల వెంట చెప్పులు అరిగేలా తిరిగేవారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందం కనబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజవర్గ టిడిపి పరిశీలకులు కన్నబాబు, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, సూరంపాలెం ప్రాజెక్టు చైర్మన్ ఉంగరాల రాము, గోకవరం సొసైటీ చైర్మన్ గాజింగం సత్తిబాబు,
గోకవరం మండల కన్వీనర్ పిల్లా అర్జునసారథి (చంటిబాబు), మండల ప్రధాన కార్యదర్శి గునుపే భరత్, తంటికొండ దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్న దొర ,క్లస్టర్ ఇంచార్జ్, బద్దిరెడ్డి బాబి,పురంశెట్టి శివాజీ,టిడిపి మండల నాయకులు దాసరి సీతారామకృష్ణ, కాకినాడ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంగరాల గణేష్, యస్ బాబు,గళ్ళ కృష్ణ,నాగం వెంకటపతి,కండేపల్లి రాంబాబు,ఆకుల కాశి,పిట్టా అరుణ్ తదితరులు పాల్గొన్నారు.




