Mummidivaram: ఉత్తర కాలువ చివరి ఆయకట్టుకూ సాగునీరు!

Mummidivaram: కోనసీమ జిల్లా టి. కొత్తపల్లిలో రైతుల సమస్యలపై ఇరిగేషన్ అధికారుల సమీక్ష. చివరి ఆయకట్టు వరకు నిరంతరాయంగా సాగునీరు అందిస్తామని హామీ.

PRABHU, RAZOLE
Published on: 16 July 2026 1:52 PM IST
Mummidivaram
X

Mummidivaram: ఉత్తర కాలువ చివరి ఆయకట్టుకూ సాగునీరు!

Mummidivaram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం మండలం టి. కొత్తపల్లి గ్రామంలో ఉత్తర కాలువ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కట్టుబడి ఉన్నామని గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు ఛైర్మన్ గుబ్బల శ్రీనివాస్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు అందించేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ పి. చినబాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఇంజనీర్ జనార్దన్ తదితర అధికారులు రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తర కాలువ పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు సక్రమంగా అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని అధికారులు రైతులకు భరోసా కల్పించారు.

అధికారుల హామీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ప్రాంతంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతున్నందున, ఇదే విధంగా నిరంతరాయంగా నీటి సరఫరా కొనసాగించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story