Sakhinetipalli: భక్తి ముసుగులో ఘరానా చోరీ.. భక్తురాలి బైక్ అపహరణ!
Sakhinetipalli: డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామ శివాలయంలో ఘరానా దొంగతనం జరిగింది.
Sakhinetipalli: భక్తి ముసుగులో ఘరానా చోరీ.. భక్తురాలి బైక్ అపహరణ!
సఖినేటిపల్లి: డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామంలోని శివాలయంలో శనివారం సాయంత్రం చోరీ ఘటన చోటుచేసుకుంది.
ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ మహిళ తన హోండా యాక్టివా ద్విచక్ర వాహనం తాళాలు, సెల్‌ఫోన్లను హుండీపై ఉంచి స్వామి దర్శనానికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తి అక్కడ మాటువేసి ఉండి, వాహనం తాళాలు తీసుకుని హోండా యాక్టివా వాహనాన్ని అపహరించి పరారయ్యాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయంలోని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Next Story




