Razole: బోన్ మ్యారో బాధితురాలికి రూ.40 వేల ఆర్థిక సాయం!
Razole: బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న గూడపల్లి మహిళకు గల్ఫ్ శెట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ రూ.40 వేల సాయం. అందజేసిన టీడీపీ నాయకురాలు గొల్లపల్లి అమూల్య.
Razole: బోన్ మ్యారో బాధితురాలికి రూ.40 వేల ఆర్థిక సాయం!
Razole: బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు గల్ఫ్ శెట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ రూ.40 వేల ఆర్థిక సాయాన్ని అందజేసింది.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, గూడపల్లి గుబ్బలపాలెంకు చెందిన గుబ్బల లక్ష్మీనారాయణికి ఈ సాయాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కట్టా భాస్కర్ చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న గల్ఫ్ శెట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ సేవలు అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాల్లో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కట్టా భాస్కర్ మాట్లాడుతూ, అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా పేద, నిరుపేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కిపురం మండల టీడీపీ అధ్యక్షుడు అడబల సాయిబాబా, గెడ్డం సింహ, గుబ్బల నూకాలు, పొన్నం గంగారావు, కందికట్ల సూరిబాబు, గుబ్బల రామారావు, కటికరెడ్డి సత్యనారాయణ, కట్టా భాస్కరరావు, వేండ్ర రాంబాబు, బొక్క పృథ్వీరాజ్, బైరిశెట్టి వీరామూర్తి, పిల్లి మోహనరావు, గుబ్బల సత్యనారాయణ, గుబ్బల శ్రీను తదితరులు పాల్గొన్నారు.




