Mamidikuduru: మామిడికుదురులో ఇమామ్ జైనుల్ ఆబెదిన్ అమరత్వ దినం
Mamidikuduru: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మరియు జగ్గన్నపేటలో హజరత్ ఇమామ్ జైనుల్ ఆబెదిన్ అమరత్వ దినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Mamidikuduru: మామిడికుదురులో ఇమామ్ జైనుల్ ఆబెదిన్ అమరత్వ దినం
మామిడికుదురు: డాక్టర్. బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురులో ముస్లింల ఆధ్యాత్మిక నాయకుడు హజరత్ ఇమామ్ జైనుల్ ఆబెదిన్ అమరత్వ దినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హజరత్ ఇమామ్ హుస్సేన్ తనయుడైన ఇమామ్ జైనుల్ ఆబెదిన్ ఇస్లాం చరిత్రలో నాలుగో ఇమామ్‌గా విశిష్ట స్థానం పొందారు.
మామిడికుదురు లోని హజరత్ ఇమామ్ హుస్సేన్ పంజాలో నిర్వహించిన మజిలీస్‌లో మత ప్రబోధకులు సయ్యద్ మీర్ హసన్ మషద్ది ప్రసంగించారు. కర్బలా ఘటన అనంతరం ఇమామ్ జైనుల్ ఆబెదిన్ ఎదుర్కొన్న కష్టాలు, త్యాగాలు, ఇస్లాం పరిరక్షణలో ఆయన పాత్రను వివరించారు.
అలాగే జగ్గన్నపేట పంజాలో మత ప్రబోధకులు మొహమ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో మజిలీస్ నిర్వహించారు. అనంతరం జగ్గన్నపేట గ్రామంలో మాతం నిర్వహిస్తూ గుమ్మటం ఊరేగింపు చేపట్టారు. సంతాప కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు హజరత్ ఇమామ్ జైనుల్ ఆబెదిన్‌కు ఘనంగా నివాళులర్పించారు.




