Kothapeta: కొత్తపేటలో కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం.. బంగారం, వెండి చోరీ!
Kothapeta: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో హెడ్ కానిస్టేబుల్ రాంబాబు ఇంట్లో చోరీ. బంగారం, వెండి ఆభరణాలు అపహరణ.. ఎస్ఐ దర్యాప్తు.
Kothapeta: కొత్తపేటలో కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం.. బంగారం, వెండి చోరీ!
Kothapeta: కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామంలోని ఓ పోలీసు ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. కొత్తపేట DSP కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాంబాబు ఆగస్ట్ 18వ తేదీ రాత్రి తన భార్యతో కలిసి వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు.
అనంతరం 20వ తేదీ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువా కూడా పగలగొట్టి, అందులో ఉన్న తన భార్యకు చెందిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనపై SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తపేట SI సురేంద్ర సూచించారు.
Next Story




