Razole: హజరత్ అబ్బాస్ పంజా వద్ద భక్తుల ప్రత్యేక ప్రార్థనలు!

Razole: మొహరం మజిలీస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మత ప్రబోధకులు మొహమ్మద్ ఖాజిమి నజఫి ఆధ్వర్యంలో కర్బలా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు

PRABHU, RAZOLE
Published on: 1 July 2026 2:38 PM IST
Razole
X

Razole: హజరత్ అబ్బాస్ పంజా వద్ద భక్తుల ప్రత్యేక ప్రార్థనలు! 

రాజోలు: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు లో మొహరం సంతాప కార్యక్రమాల్లో భాగంగా హజరత్ అబ్బాస్ పంజా వద్ద సోమవారం సాయంత్రం సంప్రదాయబద్ధంగా మజిలీస్ నిర్వహించారు.

ప్రతి ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాతం నిర్వహించారు.మత ప్రబోధకులు మొహమ్మద్ ఖాజిమి నజఫి మజిలీస్ ఆలపించి, కర్బలా అమరవీరుల త్యాగాలను వివరించారు.

కోర్కెలను తీర్చే దైవంగా భక్తులు విశ్వసించే హజరత్ అబ్బాస్‌ను "కమర్-ఎ-బనీ హాషిమ్" అని కూడా భక్తిశ్రద్ధలతో సంబోధిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం పంజా కమిటీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story