Anakapalli: ఒత్తిడి లేని జీవితానికి యోగా ఒక వరం.. వంగలపూడి అనిత!
Anakapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో "యోగాంధ్ర" వేడుకలు పండగ వాతావరణంలో జరిగాయి.
Anakapalli: ఒత్తిడి లేని జీవితానికి యోగా ఒక వరం.. వంగలపూడి అనిత!
Anakapalli: అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత,అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొని యోగాసనాలు వేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు పాల్గొని యోగ సాధన చేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాసనాలు వేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప ప్రాచీన వారసత్వ సంపద అని, యోగాలో ప్రపంచానికే మన దేశం మార్గదర్శిగా నిలిచిందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, నేడు అనేక దేశాలు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవడం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. ప్రస్తుత కాలంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు,
విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో యోగా ఒక వరంలా పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ నిత్య జీవితంలో భాగం చేసుకుని ప్రతిరోజూ కొంత సమయం యోగ సాధనకు కేటాయించాలని సూచించారు. యోగ ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.




