Gokavaram: కొత్తపల్లి పెద్ద చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు: చర్యలేవి?

Gokavaram: గోకవరం మండలం కొత్తపల్లి పెద్ద చెరువులో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 17 Sept 2026 8:20 PM IST
Gokavaram
X

Gokavaram: కొత్తపల్లి పెద్ద చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు: చర్యలేవి?

గోకవరం: మండలంలోని కొత్తపల్లి గ్రామ పెద్ద చెరువులో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తవ్వకాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెరువు గర్భంలో జరుగుతున్న తవ్వకాలపై అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి, అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయా? అనే విషయాలను స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

కళ్లముందే తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఇకనైనా స్పందించి చెరువును పరిశీలిస్తారా? చర్యలు ఎప్పుడు తీసుకుంటారో వేచి చూడాలి.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM