Razole: జస్టిస్ పున్నయ్య కమిషన్ ఉత్తర్వులు అమలు చేయాలి: దళిత నేతలు
Razole: రాష్ట్రంలో దళితులపై దాడులను అరికట్టేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ ప్రొసీడింగ్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని దళిత చైతన్య వేదిక నేతలు డిమాండ్ చేశారు.
Razole: జస్టిస్ పున్నయ్య కమిషన్ ఉత్తర్వులు అమలు చేయాలి: దళిత నేతలు
రాజోలు: ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులను అరికట్టేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సూచనలు, ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని దళిత చైతన్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. అధికారుల అలసత్వం వల్లే దళితులపై దాడులు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజోలు మండలం తాటిపాక లోని అంబేడ్కర్‌నగర్, ఈదరాడ కాల్వగట్టు ప్రాంతాల్లో ‘ఇంటింటా అంబేడ్కర్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి అంబేడ్కర్ జీవిత విశేషాల బుక్‌లెట్లను పంపిణీ చేసి, ఆయన చిత్రంతో కూడిన స్టిక్కర్లను గుమ్మాలకు అతికించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దళితుల రక్షణకు ఉన్న చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో 27 మంది దళితులపై దాడులు జరిగాయని పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, బాధితులకు తక్షణ న్యాయం అందించాలని డిమాండ్ చేశారు. దళితుల హక్కులు, ఆత్మగౌరవం, రక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, విసికే పార్టీ రాష్ట్ర నాయకులు బొంతు రమణ, చిలకపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.




