Amalapuram: క్వింటాల్ ధాన్యానికి రూ.72 పెంపు.. మద్దతు ధర ఖరారు!

Amalapuram: కోనసీమ జిల్లాలో ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని, క్వింటాల్‌కు రూ.72 మద్దతు ధర పెరిగిందని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నైడియా దేవి వెల్లడించారు.

SURESH, AMALAPURAM
Published on: 15 Sept 2026 9:32 PM IST
Amalapuram
X

Amalapuram: క్వింటాల్ ధాన్యానికి రూ.72 పెంపు.. మద్దతు ధర ఖరారు!

అమలాపురం: ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026-27 జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వై.ఖోమ్ నైడియా దేవి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026-27 సంబంధించి జిల్లా పౌరసరఫరాలు,వ్యవసాయ, మార్కెటింగ్,బ్యాంకింగ్, సహకార,రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ,రైతు మద్దతు ధర,తేమశాతం,గోనె సంచులు,రవాణా సదుపాయం వంటి అంశాల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి మాట్లాడుతూ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 1,19,176 ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ గణాంకాల ఆధారంగా అంచనా వేశారు. సగటు ఎకరాకు 2.70 మెట్రిక్ టన్నుల దిగుబడి ఆధారంగా మొత్తం 3,33,413.817 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా,ఇందులో స్థానిక వినియోగం సుమారు 33,387.524 మెట్రిక్ టన్నులు కాగా,3,00,026.293 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్వింటాల్‌కు రూ.72 పెరిగిన కనీస మద్దతు ధర.

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026–27కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,441,గ్రేడ్–A రకానికి రూ.2,461 చొప్పున కనీస మద్దతు ధర లభించనుందని, గతఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26తో పోలిస్తే క్వింటాల్‌కు రూ.72 పెరిగిందని తెలియజేసారు.2025–26లో సాధారణ రకం ధాన్యానికి రూ.2,369, గ్రేడ్–Aకి రూ.2,389 కనీస మద్దతు ధర ఉండగా, ప్రస్తుత సీజన్‌లో ఈ ధరలు వరుసగా రూ.2,441, రూ.2,461కు పెరిగాయని తెలిపారు.

జిల్లాలో ప్రధానంగా MTU-7029, MTU-1318, NP-9558 మరియు ఇతర రకాలు మొత్తం వరి రకాల సాగు 11,9176 ఎకరాలలో 300026.293 లక్షల ఉత్పత్తి అంచనా వేయడం జరిగిందన్నారు.కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి.మార్కెట్‌కు ధాన్యం రాకలు 2026 నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున,అందుకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు,తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే పరికరాలు, గోనె సంచులు, రవాణా తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.

రైతులు పండించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి, వారికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అందేలా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా రవాణా, మిల్లింగ్ తదితర ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలన్నారు.

రైతులకు కొనుగోలు ప్రక్రియపై ముందస్తుగా అవగాహన కల్పించాలని,ధాన్యం నాణ్యత ప్రమాణాలు,తేమ శాతం,కనీస మద్దతు ధర తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం అందించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026–27 ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహిస్తూ రైతులకు మద్దతు ధర అందేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం కారణంగా 50% వర్షపాతం తక్కువ నమోదయినందున ఖరీఫ్ పంటకు సాగునీరు ఇబ్బంది జరిగిన రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం పండించుటకు సత్వరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించి రైతులు ద్రవజీవ అమృతాన్ని పిచికారి వినియోగించడం వల్ల పంట ఉత్పత్తి మెరుగుపడిందని తెలియజేశారు.

జిల్లాలో రైతు సేవా కేంద్రాలు సంబంధించి రవాణా సదుపాయం ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న గోదాములో స్టోరేజ్ కేంద్రాల పరిస్థితి తెలుసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని మిల్లర్ రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రైతుల పంటకు సంబంధించి ఎగుమతి దిగుమతి పేమెంట్ అంశాలలో ఎటువంటి ఆంక్షలు విధించకుండా తక్షణమైన చర్యలు తీసుకోవాలని మిలర్ల ను కోరారు. డివిజన్,మండల స్థాయిలో ఆర్డీవోలు 2026 - 27 దాన్యం కొనుగోల ప్రక్రియపై ప్రభుత్వ ఆదేశాల అనుసరించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టే దిశగా సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు.

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026-27 కు రైతు సేవ కేంద్రాల వద్ద శాఖల మధ్య సమన్వయంతో జిల్లా, మండల,నియోజకవర్గ, గ్రామ స్థాయిలో అక్టోబర్ 6 నుంచి 27 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలు సంబంధించి రైతులకు అందుబాటులో కంట్రోల్ రూమ్ నెంబర్స్ 83094-32487, 94416- 92275 రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే విధంగా ఈ నెంబర్లు స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అందుబాటులో ఉంటాయన్నారు.

ఈ సమావేశంలో అమలాపురం ఆర్టీవో కే సరళావతి, జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ కే బాల కుమారి,వ్యవసాయ శాఖ అధికారి ఎం.రామారావు,జిల్లా సివిల్ సప్లై అధికారి పి.విజయ్ భాస్కర్,లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవ వర్మ,మార్కెటింగ్ శాఖ అధికారి కె విశాలాక్షి,సహకార శాఖ అధికారి హుస్సేన్,కొత్తపేట డివిజనల్ పరిపాలన అధికారి ఎస్ శ్రీదేవి,జిల్లా మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేశం శెట్టి లక్ష్మీనారాయణ,

రైస్ మిల్లర్ సెక్రెటరీ ఎస్ సత్తిరెడ్డి, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శంకర విశ్వేశ్వరరావు,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ టి నాగలక్ష్మి,మార్క్ఫెడ్ డి ఎం కే మీనా కుమారి డిఏఓ ఎస్ పవన్ కుమార్,ఎస్ డబ్ల్యూ సి మేనేజర్ బషీర్ అహ్మద్,ట్రాన్స్పోర్ట్ అధికారి పి జె సురేష్ కుమార్, ఫుడ్ సేఫ్టీ మేనేజర్లు పేరూరు కే శ్రీనివాసరావు ఎల్ ఆదిత్య రెడ్డి, పౌర సరఫరాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM