Indupalli: ఇందుపల్లిలో వైభవంగా మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాడమాసం సారె!

Indupalli: అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లిలో గ్రామీణ దేవత మావుళ్ళమ్మకు ఆషాడ మాసం సారె సమర్పించిన మహిళలు.

SURESH, AMALAPURAM
Published on: 9 Aug 2026 1:45 PM IST
Indupalli
X

Indupalli: ఇందుపల్లిలో వైభవంగా మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాడమాసం సారె!

Indupalli: అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లిలో గ్రామ దేవత మావుళ్ళమ్మకు గ్రామస్తులు ఆషాడ మాసం సారె సమర్పించారు.గ్రామంలోని మహిళలందరూ కలిసి డోలు సన్నాయి మేళతాళాలతో మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాడ మాసం సారే చీర,సారె, పసుపు కుంకుమ,పానకం నైవేద్యాలతో గ్రామంలో ఊరేగుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

భక్తుల కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ప్రసిద్ధి చెందిన అమ్మవారు కావడంతో గ్రామంలోని మహిళలందరూ తరలివచ్చారు.అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలమీద ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో అమ్మవారు భక్తులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story