Amalapuram: జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రామాంజనేయులు!

Amalapuram: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పోస్టర్లను జిల్లా అధికారి డాక్టర్ ఎం. రామాంజనేయులు ఆవిష్కరించారు.

SURESH, AMALAPURAM
Published on: 12 Aug 2026 7:13 PM IST
Amalapuram
X

Amalapuram: జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రామాంజనేయులు!

అమలాపురం: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు. ఐఈసీ కరపత్రాలు,ఆరోగ్య దీపిక పోస్టర్ల ఆవిష్కరణ.ఎయిడ్స్ పై అపోహాలు నమ్మవద్దని జిల్లా డిస్ట్రిక్ట్ లెప్రసీ, ఎయిడ్స్ అధికారి డా. ఎం.రామాంజనేయులు తెలిపారు.బుధవారం అమలాపురం స్థానిక ఏరియా ఆసుపత్రి నందు ఆర్‌ఎంఓ డా. అనూష,మెడికల్ ఆఫీసర్ డా. చంద్రశేఖర్,స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎ.వీరబాబుతో కలిసి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) మార్గదర్శకాలు,రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ (దిశా)ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఐఈసీ పోస్టర్లు,కరపత్రాలు,ఆరోగ్య దీపికలు ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇందులో భాగంగా అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే రద్దీ ప్రాంతాల్లో 32 కళాజాత కార్యక్రమాల ద్వారా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి నివారణ, పరీక్షలు,చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.25 గ్రామాల్లో ప్రత్యేక ప్రచారం.జిల్లాలో ఎంపిక చేసిన 25 గ్రామాల్లో మార్కెట్ ప్రాంతాలు,షాపింగ్ మాల్స్, ఇతర ప్రజా సమూహ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఐఈసీ కరపత్రాలను పంపిణీ చేయనున్నారు.ప్రజల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు సంబంధించిన అపోహలు, అనుమానాలను తొలగించి, వాస్తవ సమాచారాన్ని అందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

విద్యార్థులకు అవగాహన సదస్సులు.పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్యా సంస్థలు,కళాశాలల వరకు విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాప్తి, నివారణ,పరీక్షలు, చికిత్సపై సరైన అవగాహన కల్పించి యువత ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలను తెలియజేయనున్నారు.ర్యాలీలుఇంటింటి అవగాహన కార్యక్రమాలు.జిల్లా స్థాయిలో అవగాహన ర్యాలీలు నిర్వహించడంతో పాటు 14,000 ఇళ్లను సందర్శించి ప్రజలకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటింటికీ ఐఈసీ కరపత్రాలను అందజేసి,వ్యాధికి సంబంధించిన అపోహలను తొలగించేందుకు అవసరమైన సమాచారాన్ని అందించనున్నారు.

అనుమానం ఉంటే హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలి.హెచ్‌ఐవీకి సంబంధించి ఎవరికైనా అనుమానం లేదా సందేహం ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలని డా. రామాంజనేయులు, ఆర్‌ఎంఓ డా. అనూష సూచించారు. హెచ్‌ఐవీ పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను వినియోగించుకోవాలని తెలిపారు.క్యూఆర్ కోడ్ 1097 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం.హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని పొందేందుకు కరపత్రాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ద్వారా స్కాన్ చేసి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు.

అదేవిధంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు సంబంధించిన సందేహాలు, సమాచారం కోసం 1097 టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డా. చంద్రశేఖర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎ. వీరబాబు, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఎ. బుజ్జిబాబు, దిశా ప్రోగ్రాం మేనేజర్ జి. శ్రీనివాస్,జేకేడబ్ల్యూఎస్,లింక్ వర్కర్స్, సీఎస్‌సీఎస్ సిబ్బంది, ఐసీటీసీ,ఏఆర్టీ,డీఎస్‌ఆర్‌సీ, టీబీ సిబ్బంది, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story