Kesanapalli: ఇరుసుమండలో డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ

Kesanapalli: కోనసీమ జిల్లా ఇరుసుమండలో డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ.

PRABHU, RAZOLE
Published on: 22 July 2026 1:18 PM IST
Kesanapalli
X

Kesanapalli: ఇరుసుమండలో డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ

కేశనపల్లి: డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలోని ఇరుసుమండ పరిసర ప్రాంతాల్లో మంగళవారం డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వ్యాధుల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

SUO ఆదినారాయణ ఆదేశాల మేరకు డాక్టర్ సాయిబాబా నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో MPHEO చంటి, హెల్త్ అసిస్టెంట్లు ఎస్. శ్రీరామ్ మూర్తి, కే. శివకుమార్, జి. గంగరాజు, MLHP జి. డైనీ, ANM టి. వెంకట రమణతో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి, ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ‘డ్రై డే–ఫ్రైడే’ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించి, దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

అలాగే దోమతెరల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వైద్య సిబ్బందిని సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story