Mummidivaram: రోడ్లు లేక అంబులెన్స్‌ రాలేదు.. చేతులపై రోగిని మోసుకెళ్లిన వైనం!

Mummidivaram: కోనసీమ జిల్లా ముమ్మిడివరం పల్లిపాలెం జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు నగర పంచాయతీ ఎదుట నిరసన తెలిపి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

M. Suneel Sastry, Mummidivaram
Updated on: 16 Sept 2026 5:22 PM IST
Mummidivaram
X

Mummidivaram: రోడ్లు లేక అంబులెన్స్‌ రాలేదు.. చేతులపై రోగిని మోసుకెళ్లిన వైనం!

ముమ్మిడివరం: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మూడో వార్డు పల్లిపాలెం జగనన్న కాలనీ వాసులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇటీవల కాలనీలో ఓ వ్యక్తి అనారోగ్యానికి గురికాగా, సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ కాలనీ లోపలికి రాలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. దీంతో బాధితుడిని చేతులపై మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

కాలనీ సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని నగర పంచాయతీ కమిషనర్ పి. రవివర్మకు సమర్పించారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి కాలనీలో తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

M. Suneel Sastry, Mummidivaram

M. Suneel Sastry, Mummidivaram