Jaggampeta: రాజపూడిలో వైఎస్సార్సీపీకి భారీ షాక్ టీడీపీలోకి 50 కుటుంబాలు!
Jaggampeta: కాకినాడ జగ్గంపేట మండలం రాజపూడిలో వైఎస్సార్సీపీకి బిగ్ షాక్! నేదూరి రమేష్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు జ్యోతుల నవీన్ సమక్షంలో టీడీపీలో చేరాయి.
Jaggampeta: రాజపూడిలో వైఎస్సార్సీపీకి భారీ షాక్ టీడీపీలోకి 50 కుటుంబాలు!
Jaggampeta: జగ్గంపేట మండలం రాజపూడి మెరక వీధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత నేదూరి రమేష్ ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాల వారు వైసీపీకి రాజీనామా చేసి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
మొరుకుర్తి సీతన్న, నేదూరి అబ్బు, నైదాని కొండబాబు, నేదూరి అప్పారావు, నేదూరి లోవదుర్గ, కొలగాని దుర్గ, నేదూరి రమణమ్మ, కిలాని వీరలక్ష్మి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పార్టీలో చేరారు. వారందరికీ జ్యోతుల నవీన్ గారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ...
"జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా మా గ్రామాల్లో రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, సంక్షేమ పథకాల అమలు జరుగుతోంది. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కష్టపడి పనిచేసి, తిరుగులేని విజయాన్ని అందిస్తామని" తెలిపారు.
జ్యోతుల నవీన్ మాట్లాడుతూ... పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని, అందరం కలిసి నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి రేఖా బుల్లి రాజు, నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు, రాజపూడి సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి బుల్లెబ్బు,బుసాల విష్ణుమూర్తి,గని శెట్టి సన్యాసిరావు, బత్తుల వెంకన్న,
ముమ్మన దుర్గాప్రసాద్, గెడ్డం అచ్చి రాజు,బత్తులగంగాధర్ ,రేఖరామనూకరాజు,మారిశెట్టిసత్తిబాబు,బొడ్డు ప్రసాద్అధిక సంఖ్యలో టిడిపి నేతలు పాల్గొన్నారు.




