Gokavaram: మృతి చెందిన దళిత యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం
Gokavaram: తంటికొండ గ్రామానికి చెందిన దళిత యువకుడు కత్తుల డేవిడ్ మృతితో ఇబ్బందుల్లో ఉన్న అతని కుటుంబానికి ఎన్ఆర్ఐ, బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ఆర్థిక సాయం, బియ్యం అందజేశారు.
Gokavaram: మృతి చెందిన దళిత యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం
గోకవరం: తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన దళిత యువకుడు కత్తుల డేవిడ్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు అమెరికాలో ఉన్న విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు.
స్పందించిన ఆయన తక్షణమే సహాయంగా 5,000 రూపాయలు నగదు, 25 కిలోల బియాన్ని కుటుంబ సభ్యులకు అందించాలని రామసేన సభ్యులు, బీజేపీ నాయకులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం రాత్రి తంటికొండ గ్రామలోని డేవిడ్ కుటుంబ సభ్యులను రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు పరామర్శించి, నగదు, బియాన్ని పంపిణీ చేసి, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పసల గణేష్, నెల్లి శ్రీను, గనిరాజు, తుమ్మల బుజ్జి, షెడ్రాక్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.




