Razole: జనసేన కీలక బాధ్యతల్లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!
Razole: కడప, రాజంపేట పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నియామకం. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతల అప్పగింత.
Razole: జనసేన కీలక బాధ్యతల్లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!
Razole: జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్‌గా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలను అప్పగించినట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని దేవ వరప్రసాద్ స్పష్టం చేశారు.




